Breaking News

బట్టతల వస్తోందని యువకుడు ఆత్మహత్య

యువకుడి ఆత్మహత్య

సారథిన్యూస్​, హైదరాబాద్​: బట్టతల వస్తోందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన హైదరాబాద్​ ఉప్పల్​లోని సత్యానగర్​లో మంగళవారం చోటుచేసుకున్నది. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన నితిన్ ఉప్పల్​ ఉంటున్నాడు. క్యాటరింగ్​ పనులు చేస్తే జీవనం సాగిస్తున్నాడు. క్యాటరింగ్​తో వచ్చిన డబ్బులను కొన్ని ఇంటికి పంపిస్తూ.. మరికొన్ని హెయిర్​ ట్రాన్స్​ప్లాంటేషన్​ కోసం దాచుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల అతడి సోదరి పెళ్లి కోసం డబ్బు కావాలని ఇంటి నుంచి సమాచారం వచ్చింది. మరోవైపు కరోనాతో క్యాటరింగ్​ పనులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో మనస్థాపం చెందిన నితిన్​ తన గదిలోని సీలింగ్​ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని.. బట్టతల వస్తుందన్న కారణంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్​ నోట్​ రాశాడు.