సారథి న్యూస్, జగిత్యాల: జగిత్యాల జిల్లా లింగంపేట చెరువులో 1.08లక్షల చేపపిల్లలను సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచన విధానంతో తెలంగాణ ఫిష్ హబ్ గా మారుతుందన్నారు. రిజర్వాయర్లు, చెరువుల్లో పుష్కలంగా చేపలు ఉన్నాయని అన్నారు. 2020- 21 సంవత్సరానికి జగిత్యాల జిల్లా సమీకృతం మత్స్య అభివృద్ధి పథకం కింద 18 మండలాల్లో 1.46 కోట్ల చేపపిల్లలను విడుదల చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రంలో 81 కోట్ల చేపపిల్లలు, ఐదుకోట్ల రొయ్య పిల్లలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జగిత్యాల జడ్పీ చైర్మన్ దావ వసంత, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ బోగ శ్రావణి, జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
- August 25, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CM KCR
- FISHHUB
- TELANGANA
- చేపలపెంపకం
- జగిత్యాల
- తెలంగాణ
- ఫిష్హబ్
- సీఎం కేసీఆర్
- Comments Off on ఫిష్ హబ్ గా.. తెలంగాణ