Breaking News

ఫస్ట్ ​డే చెంచుపెంటల టూర్​

ఫస్ట్​డే చెంచుపెంటల టూర్​

  • చెంచుల సమస్యలు తెలుసుకున్న నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టర్ శర్మన్​
  • పరిష్కరిస్తానని చెంచుబిడ్డలకు భరోసా

సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టర్ గా ఎల్.శర్మన్​ శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన వెంటనే లింగాల, అమ్రాబాద్‌ మండలాల పరిధిలోని అప్పాపూర్‌ చెంచుపెంటలకు సందర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్​వాడీ సెంటర్, స్కూలును పరిశీలించారు. చెంచుల ఉపాధి, జీవన ప్రమాణాలను తెలుసుకున్నారు. చెంచులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. 30మంది రైతులకు బ్యాంకు అకౌంట్ నంబర్లు లేవని, ఆశావర్కర్ మాత్రమే వస్తుందని, ఏఎన్ఎం రావడం లేదని, చెంచుపెంటలో నీటి సమస్య ఉందని వారు ఆయన దృష్టికి తెచ్చారు. బ్యాంక్ అకౌంట్లు లేని చెంచు రైతులకు ఆయా గ్రామాల సర్పంచ్​లు, కార్యదర్శులు బ్యాంకు అకౌంట్లను వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బోర్ వెంటనే ఏర్పాటుచేసి నీటివసతి కల్పించాలని ఆదేశించారు. చెంచుల ఆరోగ్యంపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. కలెక్టర్ వెంట ఐటీడీఏ పీవో అఖిలేశ్‌రెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి అనిల్ ప్రకాష్, అచ్చంపేట ఆర్డీవో పాండునాయక్ ఆర్​డబ్ల్యూఎస్ డీఈ, ఇతర అధికారులు ఉన్నారు.