హైదరాబాద్: కరోనా నుంచి కోలుకున్న వారు స్వచ్చంధంగా ముందుకు వచ్చి రోగుల ప్రాణాలు కాపాడాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ప్లాస్మాను దానం చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. ఈ మేరకు మెగాస్టార్ శనివారం ట్వీట్ చేశారు. ‘కరోనాను జయించిన వారికి ఇదే నా అపీల్. రికవరీ అయిన వాళ్లు ముందుకు వచ్చి ప్లాస్మాను డొనేట్ చేయండి. ప్రాణాలను కాపాడండి. మహమ్మారి ప్రబలుతున్న వేళ ఇంత కంటే మానవత్వం ఇంకోటి లేదు. కరోనా వారియర్స్ ఇప్పుడు ప్రాణ రక్షకులుగా మారండి’ అని చిరు ట్వీట్ చేశారు. ఈ మేరకు సీపీ సజ్జనార్ పాస్ల్మా డోనేషన్ గురించి మాట్లాడుతున్న వీడియోను కూడా ట్వీట్ చేశారు.