సారథి న్యూస్, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సెక్రటేరియట్ హెచ్ఎండీవోలు, జిల్లాస్థాయిలో ఉద్యోగుల ప్రమోషన్లు ఎలాంటి జోక్యం లేకుండా జనవరి 31వ తేదీలోపు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ కుమార్ ఆదేశించారు. సోమవారం వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ప్రమోషన్ తో పాటు కారుణ్య నియామకాల ప్రక్రియను ఎటువంటి జోక్యం లేకుండా పూర్తి చేయాలన్నారు. ప్రమోషన్లు ఇవ్వడం వల్ల ఖాళీలను కూడా ప్రత్యక్ష నియామకాల నోటిఫికేషన్ లో చేర్చాలని ఆదేశాలు జారీచేశారు. ప్రమోషన్లు, కారుణ్య నియామకాలు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల భర్తీకి జనవరి 6, 20, 27 తేదీల్లో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
- January 4, 2021
- Archive
- Top News
- తెలంగాణ
- CM KCR
- CS SOMESHKUMAR
- GOVT
- PROMOTIONS
- TELANGANA
- ఉద్యోగుల ప్రమోషన్లు
- తెలంగాణ
- సీఎం కేసీఆర్
- సీఎస్ సోమేశ్‌కుమార్
- Comments Off on ప్రమోషన్ల రిపోర్టు రెడీ చేయండి