Breaking News

ప్రమాదాల నివారణకు ఇలా చేద్దాం

సారథి న్యూస్​, ములుగు: రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని ములుగు కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

జిల్లాలోని అన్ని రహదారుల్లో ప్రమాద స్థలాలు, బ్లాక్ స్పాట్స్ గుర్తించాలన్నారు. ఓవర్ లోడ్, లైసెన్స్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపటం పై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇటీవల భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్​ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) ఆదర్శ్ సురభి, ములుగు ఏఎస్పీ సాయి చైతన్య, జిల్లా రెవెన్యూ అధికారి కే రమాదేవి, ఆర్ అండ్ బి ఈఈ వెంకటేశ్​, పీఆర్ ఈఈ రాంబాబు, ఆర్టీసీ డీఎం భాను కిరణ్, ఏఎంవీఐ రాజశేఖర్, ఎక్సైజ్ సీఐ సుధాకర్, బాబు తదితరులు పాల్గొన్నారు.