పుట్టాన్‌దొడ్డి(ఇటిక్యాల): ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన 40 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పుట్టాన్‌దొడ్డి శివారులో 171, 172 సర్వేనంబరులోని ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు గ్రామస్థులు ప్రయత్నించారు. దీనిపై రెవెన్యూ సిబ్బంది బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేసి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసి ఆక్రమించేందుకు యత్నించిన 40 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
- August 15, 2020
- Archive
- క్రైమ్
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- GADWAL
- GOVERNMENT
- LAND
- MRO
- POLICE
- REVENUE
- కేసులు
- పోలీసులు
- ప్రభుత్వం
- Comments Off on ప్రభుత్వ భూమి కబ్జా.. 40 మందిపై కేసు