![ప్రభుత్వం సాగించేది ఆటవిక పాలన](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/WhatsApp-Image-2020-07-25-at-7.11.53-PM.jpeg?fit=1156%2C867&ssl=1)
సారథి న్యూస్, కృష్ణా: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబసభ్యులను మాజీ మంత్రి దేవినేని ఉమా, బచ్చుల అర్జునుడు పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది. దురుద్దేశంతో కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతుంది. భవిష్యత్తులో జగన్ తగిన మూల్యం చెల్లించక తప్పదు. రాజ్యాంగ విలువలు, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను గాలికి వదిలేసి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తోంది. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రకు బెయిల్ రాకుండా కుట్రలు చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి నలంద కిషోర్ మరణానికి కారణమయ్యారు. నలంద కిషోర్ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అక్రమ కేసులు పెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి.’ అని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.