యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ సరసన నివేథా థామస్ చాన్స్ దక్కించుకుందట. నాగ్అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇప్పటికే దీపికాపదుకొనే హీరోయిన్గా ఎంపికకాగా.. సెకండ్ హీరోయిన్గా నివేథా థామస్‌ను తీసుకోనున్నట్టు టాక్. బాహుబలి సీరిస్ తర్వాత ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. కాగా బాహుబలి తర్వాత వచ్చిన ‘సాహో’ విజయవంతం కాకపోయినప్పటికీ.. ఉత్తరాదిన మంచి వసూళ్లే రాబట్టింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రభాస్ చేసే ప్రతి సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు నిర్మాతలు. ఈ క్రమంలోనే నివేథాను ఎంపికచేసినట్టు సమాచారం. ‘రాధేశ్యామ్’ చిత్రం పూర్తవగానే.. నాగ్ అశ్విన్‌తో చిత్రానికి ప్రభాస్ రెడీ అవుతారు. నివేథా థామస్ ఎంపికపట్ల ప్రభాస్ ఫ్యాన్స్ కొంత నిరాశతో ఉన్నట్టు టాక్. ప్రభాస్ హైట్ కు ఆమె సరిపోదని వారి అభిప్రాయం.
- August 17, 2020
- Archive
- సినిమా
- HYDERABAD
- NAGASWIN
- PANINDIA
- PRABHAS
- కొత్తసినిమా
- నాగ్అశ్విన్
- ప్యాన్ఇండియా
- ప్రభాస్
- హైదరాబాద్
- Comments Off on ప్రభాస్‌కు జోడీగా నివేథా.. ఫ్యాన్స్ నిరాశ