Breaking News

ప్రధాని మోడీ వల్లే మాంద్యంలోకి భారత్

ప్రధాని మోడీ వల్లే మాంద్యంలోకి భారత్


న్యూఢిల్లీ: దేశచరిత్రలోనే ఇండియా మొదటిసారి ఆర్థిక మాంద్యంలోని అడుగుపెట్టబోతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రధాని నరేంద్రమోడీ అవలంభిస్తున్న విధానాల కారణంగానే బలంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బలహీనంగా మారిందని విరుచుకుపడ్డారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్​ వేదికగా కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఎలా కొట్టుమిట్టాడుతుందో న్యూస్ పేపర్లలో వచ్చిన రిపోర్టులను జతచేశారు. కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ నాయకుడు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. కరోనా వైరస్ సంక్షోభం, నిరుద్యోగం, ఆర్థిక అంశాలు తదితర కారణాలపై కేంద్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.