సారథి న్యూస్, హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. వికారాబాద్, తాండూర్, పరిగి పట్టణాల పట్టణాల అభివృద్ధిపై చర్చ జరిగింది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో హరితహారం కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. పట్టణాల్లో పార్కులు. ఫుట్ పాత్ రోడ్లు, టాయిలెట్లు, శ్మశాన వాటికల పనులపై సూచనలు చేశారు. సమావేశంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
- June 16, 2020
- Top News
- తెలంగాణ
- HARITHAHARAM
- KTR
- VIKARABAD
- కేటీఆర్
- వికారాబాద్
- హరితహారం
- Comments Off on ప్రతిష్టాత్మకంగా హరితహారం