సారథిన్యూస్, రామడుగు/ గంగాధర: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో రూ. 15 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. కాగా గంగాధర మండలం కొండయ్యపల్లిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గురువు చెట్టుపల్లి కొండయ్య అనారోగ్యంతో మృతిచెందారు. వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కల్గెటి కవిత, ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి, వీర్ల సరోజన, సింగిల్ విండో డైరెక్టర్ ఆముదాల రమణారెడ్డి, టీఆర్ఎస్ నేతలు చెట్టిపల్లి నరేందర్, తిరుపతి, జిల్లా కో-ఆఫ్షన్ మెంబర్ సుక్రోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
- July 2, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- DEVELOPMENT
- KARIMNAGAR
- MLA
- RAMADUGU
- RAVISHANKAR
- ఎమ్మెల్యే
- రవిశంకర్
- Comments Off on ప్రగతిపథంలో తెలంగాణ