సారథి న్యూస్, మెదక్: ఈనెల 11వ తేదీలోగా మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేవించారు. శుక్రవారం ఆయన కల్లెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 429 పంచాయతీలతో పాటు గుర్తించిన 84 మదిర గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో 27లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయని, అధికారులు ఒక స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. జిల్లాలో ధరణి అద్భుతంగా పనిచేస్తోందన్నారు. ప్రభుత్వం ఎంతో నమ్మకంతో తహసీల్దార్లను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా నియమించిందన్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పారదర్శకంగా పనిచేయాలన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ప్రకృతి వనాల పనులను పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి లావాదేవీకి రూ.200 ప్రాసెసింగ్ఫీజు కట్టవలసి ఉందనే విషయాన్ని ఫ్లెక్సీ కట్టాలన్నారు. ఆయన వెంట జడ్పీ సీఈవో లక్ష్మిబాయి, డీఆర్డీవో శ్రీనివాస్, ఆర్డీవో సాయిరాం, శ్యాంప్రకాష్, తహసీల్దార్లు ఉన్నారు.
- November 6, 2020
- Archive
- మెదక్
- షార్ట్ న్యూస్
- COLLECTOR
- DHARANI
- medak
- ధరణి
- ప్రకృతివనాలు
- మెదక్
- Comments Off on ప్రకృతివనాల పనులు పూర్తవ్వాలే