Breaking News

ప్రకృతివనం.. ఆహ్లాదభరితం

ప్రకృతి వనం.. ఆహ్లాదభరితం

సారథిన్యూస్, రామడుగు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పల్లె పకృతి వనం’ కార్యక్రమంలో గ్రామాలన్నీ ఆహ్లాదభరితంగా మారనున్నాయని పీడీ వెంకటేశ్వరరావు, ఏపీడీ మంజుల, ఏపీవో చంద్రశేఖర్​ పేర్కొన్నారు. శనివారం ఆయన కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో ప్రకృతివనాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పల్లెలను ఆహ్లాదభరితంగా ఉంచాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. కార్యక్రమంలో పీడీ వెంకటేశ్వర్లు, ఏపీడీ మంజుల, ఏపీవో చంద్రశేఖర్​, పంచాయతీ కార్యదర్శి అనిల్ తదితరులు పాల్గొన్నారు.