సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు పోలీసు సంక్షేమంలో భాగంగా 55 ఏళ్లు పైబడి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి హెల్త్ కండీషన్‌ను పరీక్షించేందుకు సోమవారం 150 పల్స్ ఆక్సీమీటర్లను పంపిణీ చేశారు. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లు, సర్కిల్ఆఫీసులు, డీఎస్పీ ఆఫీసులకు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చినట్లు తెలిపారు. పల్స్ ఆక్సీమీటర్ ద్వారా ముందస్తుగా కరోనా లక్షణాలను తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో నాన్ కేడర్ ఎస్పీ ఆంజనేయులు, ఎఆర్ ఆడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ, పోలీసు వెల్ఫేర్ డాక్టర్ స్రవంతి గారు, కోవిడ్ కంట్రోల్ రూమ్ ఇన్చార్జ్ డీఎస్పీ నాగభూషణం, ఆర్ఐ రాధాకృష్ణ పాల్గొన్నారు.
- June 29, 2020
- Archive
- Top News
- POLICE
- PULSOXIMETER
- ఎస్పీ
- పల్స్‌ఆక్సీమీటర్లు
- పోలీసులు
- Comments Off on పోలీసులకు పల్స్ ఆక్సీమీటర్లు