సారథి న్యూస్, కర్నూలు: ప్రముఖ సమరయోధుడు గులాం రసూల్ ఖాన్180వ వర్ధంతిని ఆదివారం నంద్యాల చెక్ పోస్టు సమీపంలోని డీసీసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ్మయాదవ్ మాట్లాడుతూ.. సిపాయిల తిరుగుబాటుకు పూర్వమే భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు జరిగాయన్నారు. 1801లో పెంచిన భూమి శిస్తుకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లాలో తెర్నేకల్ గ్రామస్తులు వీరోచితంగా పోరాడి అసువులు బాసారని గుర్తుచేశారు. కర్నూలు చివరి నవాబు గులాం రసూల్ ఖాన్ బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశారని అన్నారు.
పట్టణంలో ప్రాంతంలో రహస్యంగా ఆయుధ కర్మాగారం నెలకొల్పి తుపాకులు కత్తులు, బాకులు ఫిరంగులు మందుగుండును తయారు చేయించారని గుర్తుచేశారు. గులాం రసూల్ ఖాన్ జయంతి. ఆయన వర్ధంతులను ఏటా ప్రభుత్వమే నిర్వహించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు బాలస్వామి, జిల్లా మైనార్టీ నాయకులు పఠాన్ అవిఖాన్, బీసీసెల్ రాష్ట్ర నాయకులు బోయ నాగరాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు విజయ్ యాదవ్, సేవాదళ్ నాయకులు వెంకటేశ్, కాంగ్రెస్ నాయకులు వెంకట్ నాయుడు పాల్గొన్నారు.