సారథి న్యూస్, మెదక్: ఎస్ఆర్సీ కొండపోచమ్మ సాగర్ ద్వారా పోచారం డ్యాం నింపి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందజేస్తామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. మంగళవారం ఆయన మెదక్ మండలం రాజ్పేట్ శివారులో రూ.5.5 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. రాష్ట్రంలోనే అన్నిటి కంటే ముందుగా పోచారం సాగర్ ప్రాజెక్టు నిండుతుందన్నారు. అయినప్పటికీ కొండపోచమ్మ సాగర్ ద్వారా హల్దీ ఎంఎన్ కెనాల్ మీదుగా ప్రాజెక్టును నింపి సాగునీరు ఇస్తామన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ లావణ్య, అడిషనల్ జేసీ నగేష్ పాల్గొన్నారు.
- June 9, 2020
- Top News
- తెలంగాణ
- HARISH RAO
- KONDAPOCHAMMA
- పోచారం సాగర్
- మెదక్
- Comments Off on పోచారం డ్యామ్‌కు కొండపోచమ్మ నీళ్లు