కోలీవుడ్ వెర్సటైల్ హీరో విక్రమ్ వరుస షూటింగ్‌లతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం చెన్నైలో అజయ్‌జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ‘కోబ్రా’ మూవీ షూటింగ్ లో పాల్గొంటొన్న ఆయన జనవరిలో హైదరాబాద్ రానున్నాడు. దర్శకుడు మణిరత్నం హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ లో విక్రమ్కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్కోసం హైదరాబాద్రామోజీ ఫిల్మ్‌సిటీలో పెద్ద సెట్‌ను నిర్మిస్తున్నారు. డిసెంబర్నెలాఖరికి దీని పనులు పూర్తి అవుతాయని షూటింగ్ జనవరిలో స్టార్ట్ చేస్తారని ఇంటిమేషన్ ఇచ్చింది టీమ్. హైదరాబాద్‌లో స్టార్టయ్యే షూటింగ్‌కు విక్రమ్ జాయిన్కానున్నాడు. ఇప్పటి వరకూ హీరోగానే నటించిన విక్రమ్ఈ మూవీలో నెగెటివ్టచ్ ఉన్న రోల్ లో కనిపించనున్నాడు. మణిరత్నం తన క్యారెక్టర్గురించి నెరేట్చేసిన విధానం చాలా నచ్చిందని.. ఇంటెన్స్, ఫైర్, అగ్రెసివ్ఇలా అన్ని షేడ్స్ కలిసి ఉన్న రోల్ అని.. అందుకే అంతగా ఇంప్రెస్అయ్యానంటున్నాడు విక్రమ్. పాత్రకు తగినట్టు మేకోవర్అయ్యే విక్రమ్ ఈ పాత్ర కోసం ఇంకొంచెం కండలు పెంచి డిఫరెంట్‌లుక్‌లో కనిపించనున్నాడు. ఈ మూవీ కంప్లీట్తర్వాత విక్రమ్తన 60ం చిత్రం చెయ్యాలి. ఇది కార్తిక్సుబ్బరాజ్డైరెక్షన్లో తెరకెక్కనుంది.
- December 15, 2020
- Archive
- Top News
- సినిమా
- KILLYWOOD
- PONNIYANSELVAM
- RAMOJIFILMCITY
- VIKRAM
- కోలీవుడ్
- పొన్నియిన్‌సెల్వన్
- రామోజీ ఫిల్మ్‌సిటీ
- విక్రమ్
- Comments Off on పొన్నియిన్ సెల్వన్ కోసం రెడీ