సారథిన్యూస్, రామడుగు: టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లతో పేదల సొంత ఇంటి కల సాకారమవుతున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పథకం బృహత్తరమైనదని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం పనులు వేగవంతం చేసి పేదలకు త్వరితగతిన అందించేలా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్, ఎంపీపీ చిలక రవీందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అజయ్, మాజీ ఎంపీపీ గుర్రం భూమారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తిరుపతిరావు, సర్పంచ్ సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- August 25, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- DOUBLE BED ROOM
- KARIMNAGAR
- MLA
- POOR PEOPLE
- SUNKE RAVISHANKAR
- ఎమ్మెల్యే
- కరీంనగర్
- డబుల్బెడ్రూం ఇండ్లు
- రవిశంకర్
- రామడుగు
- Comments Off on పేదల సొంతింటి కల సాకారం