సారథి న్యూస్, కర్నూలు: ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలన్నదే ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యమని ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పార్థసారధి అన్నారు. 2021లో రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టించాలనే ఉద్దేశంతో ప్రధాని ఏపీకి 11 లక్షల ఇళ్లు కేటాయించారని అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన హయాంలో అనుచరులకు దోచిపెట్టారని అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో రూ.ఏడువేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చాల్సిన బాధ్యత సీఎం జగన్మోహన్రెడ్డిపై ఉందన్నారు.
- July 22, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- కర్నూలు
- CM JAGAN
- Kurnool
- MODI
- కర్నూలు
- ప్రధాని మోడీ
- బీజేపీ
- సీఎం వైఎస్ జగన్
- Comments Off on పేదలకు ఇళ్లు కట్టివ్వడమే లక్ష్యం