సారథిమీడియా, హైదరాబాద్: పేటీఎం యాప్ను ప్లే స్టోర్ నుంచి తీసేసినట్టు గూగుల్ సంస్థ సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుతం ప్లేస్టోర్లో ఈ యాప్ అందుబాటులో లేదు. గ్యాంబ్లింగ్ నిబంధనలు ఉల్లగింఘించి ఆన్లైన్ బెట్టింగ్లు పెడుతున్నందున ఈ యాప్ను తొలగించినట్టు గూగుల్ స్పష్టం చేసింది. కాగా పేటీఎం బిజినెస్, పేటీఎం మాల్, పేటీఎం మనీ యాప్స్ మాత్రం యాథావిధిగా కొనసాగనున్నాయి.
పేటీఎం ఏమంటుందంటే..
గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే ఈ యాప్ను తొలగించారని.. ప్రస్తుతం డౌన్లోడ్, అప్డేట్ చేసుకొనే అవకాశం లేదని చెప్పింది. అయితే వినియోగదారులు సొమ్ము కు ఢోకాలేదని పేటీఎం స్పష్టం చేసింది. త్వరలోనే సేవలు పున:ప్రారంభిస్తామని పేర్కొన్నది. కాగా ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్న వినియోగదారుల యథావిధిగా ఈ యాప్ను వినియోగించుకోవచ్చు. కేవలం అండ్రాయిడ్ వినియోగదారులు మాత్రమే కొత్తగా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరు. ఐవోఎస్ వినియోగదారులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.