Breaking News

పెళ్లిళ్లకు అనుమతి తప్పనిసరి

పెళ్లిళ్లకు అనుమతి తప్పనిసరి

సారథి న్యూస్, హైదరాబాద్: పెళ్లిళ్ల కోసం అనుమతులు ఇచ్చే బాధ్యతలను మండల తహసీల్దార్​కు అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీచేసింది. జూలై 21వ తేదీ నుంచి శ్రావణం మాసం మొదలుకానుండడంతో పెద్దఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. అయితే తహసీల్దార్లు కేవలం పెళ్లిళ్లకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని, ఇతర ఫంక్షన్లకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వం తేల్చిచెప్పింది పెళ్లికొడుకు, పెండ్లికూతురు తరఫున 20 మంది మాత్రమే హాజరయ్యేలా ఆదేశాలు ఇచ్చింది. పెండ్లి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వారు వివాహానికి హాజరైన 20 మంది వివరాలతో పాటు వెడ్డింగ్​ కార్డు, ఆధార్ కార్డు, కరోనా రిపోర్టులతో పాటు రూ.10 నాన్ జ్యూడిషియల్ స్టాంపుపై అఫిడవిట్ ను తహసీల్దార్​కు అందించాల్సి ఉంటుంది. నిబంధనలు పాటించకపోతే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.