న్యూఢిల్లీ: దేశంలో గత 20 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం కూడా పెట్రల్ పై లీటర్‌కు 21 పైసలు, డీజిల్‌పై 17 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రూ.80.13కి చేరగా.. డీజిల్ ధర రూ.80.19.. ఈ నెల 7 నుంచి ప్రతి రోజు డీజిల్, పెట్రోల్‌పై రేట్లను ఆయిల్ కంపెనీలు రివైజ్ చేస్తూనే ఉన్నాయి. కేవలం బుధవారం ఒక్కరోజు మాత్రమే పెట్రోల్ ధర పెంచలేదు. డీజిల్ ధరలు పెంచడంతో పెట్రోల్ కంటే డీజిల్ ధర ఎక్కువగా ఉంది. పెట్రోల్ కంటే డీజిల్ ధర అధికమవడం అదే మొదటిసారి. ఢిల్లీ ప్రభుత్వం డీజిల్‌పై వ్యాట్ ఎక్కువగా వేసిందని అందుకే అంత రేటు పెరిగిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ సంజీవ్ సింగ్ అన్నారు.
నగరం | పెట్రోల్ | డీజిల్ |
హైదరాబాద్ | 83.18 | 78.36 |
ఢిల్లీ | 80.13 | 80.19 |
కోల్‌కతా | 81.82 | 75.34 |
ముంబై | 86.91 | 78.51 |
చెన్నై | 83.37 | 77.44 |