Breaking News

పెట్రోలును దాటేసిన డీజిల్

న్యూఢిల్లీ: దేశంలో డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. డీజిల్‌ ధర వరుసగా బుధవారం 18వ రోజు పెరిగింది. పెట్రోల్‌ ధరలు మాత్రం యథాతథంగానే ఉన్నాయి. దీంతో డీజిల్‌ రేటు పెట్రోల్‌ను మించిపోయింది. పెట్రోల్‌ ధర కంటే డీజిల్‌ ధర ఎక్కువగా ఉండడం ఇదే తొలిసారి. డీజిల్‌పైన 0.48 పైసలు పెంచారు. దీంతో ఢిల్లీలో రూ.79.40 ఉన్న డీజిల్‌ ధర ప్రస్తుతం రూ.79.88కి చేరింది. పెట్రోల్‌ ధర రూ.79.76గా ఉంది. ఈ 18 రోజుల్లో పెట్రోల్‌పై రూ.9.41, డీజిల్‌ పై రూ.9.58 చొప్పున పెంచారు. 2018లో ఢిల్లీలో రూ.61.74 ఉన్న డీజిల్‌ ఒకటిన్నర సంవత్సరంలో రూ.18 పెరిగింది.
ప్రధాన నగరాల్లో ధరలు

నగరంపెట్రోల్‌డీజిల్‌
ఢిల్లీ 79.7679.88
కోల్‌కతా 81.45 75.06
ముంబై 86.54 78.22
చెన్నై 83.04 77.17
హైదరాబాద్‌ 82.7978.06