‘మహానటి’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరింది కీర్తిసురేష్. నెక్ట్స్ ఓ సైకలాజికల్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి ప్రధానపాత్రలో ఈశ్వర్ కార్తీక్ రూపొందించిన ‘పెంగ్విన్’ సినిమా మూడు భాషల్లో ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో రిలీజ్‌కు సిద్ధమైంది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమా నిర్మాత. ఈ సినిమా ట్రైలర్ ను గురువారం తెలుగులో నాని, తమిళంలో ధనుష్, మలయాళంలో మోహన్ లాల్ విడుదల చేశారు. ఓ అడవికి సమీపంలో ఓ ఫామ్ హౌస్ కీర్తి ఫ్యామిలీ ఉంటారు. గర్భవతిగా కనిపిస్తున్న కీర్తికి అప్పటికే ఓ ఐదేళ్ల కొడుకు ఉంటాడు. సడెన్‌గా తన కొడుకు కనిపించకుండా పోతాడు. పోలీసులు ఎంతగా వెదకినా దొరక్కపోయేసరికి ఆ అబ్బాయి చనిపోయాడని..
సైకో కిల్లర్ చంపేసి ఉండొచ్చని తేల్చేసిన పోలీసులు కేస్ క్లోజ్ చేయాలనుకుంటారు. కానీ తల్లి ప్రేమ ఆ విషయాన్ని నమ్మ నివ్వదు. తానే స్వయంగా కొడుకు కోసం అన్వేషించడం ప్రారంభిస్తుంది. కొడుకుని ఏ స్థితిలో చేరుకుంటుంది? అన్నది మిగతా కథ. రెండు నిముషాల నిడివితో ఉన్న ట్రైలర్ ప్రేక్షకులను థ్రిల్ చేసేలా సాగింది. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. లాక్‌డౌన్‌తో థియేటర్స్ ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితులు లేకపోవడంతో ‘అమెజాన్ ప్రైమ్’ ద్వారా జూన్ 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.