సారథి న్యూస్, మానవపాడు: తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉమ్మడి మండలంలోని పుల్లూరు పుష్కర ఘాట్ భక్తుల తాకిడితో పులకరించింది. పుష్కరాలు ఆదివారానికి పదిరోజులు కావడంతో భక్తుల తాకిడి ఎక్కువైంది. ఓ వైపు తుఫాన్.. మరోవైపు కరోనా ప్రభావం ఉన్నప్పటికీ భక్తులు అన్ని జాగ్రత్తులు తీసుకుంటూ పుణ్యస్నానాలు ఆచరించారు. పుల్లూరులో ఉన్న శివాలయం, కాలభైరవుడు సూర్యనారాయణ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి దర్శనం చేసుకున్నారు.పుల్లూరు సర్పంచ్ నారాయణమ్మ తన కుటుంబసభ్యులతో ఆదివారం పుష్కర స్నానం చేసి తుంగభద్ర నదీమ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.
సెల్ఫీలతో ఎంజాయ్
జోగుళాంబ గద్వాల జిల్లాలో ఏర్పాటుచేసిన అలంపూర్ పుల్లూరు ఘాట్లలో పుష్కర స్నానాలు ఆచరించి సెల్ఫీలతో భక్తులు తెగ ఎంజాయ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పుష్కర స్నానాలు ఎంతో ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసిందని పుష్కర స్నానాలు చేయడం, ప్రత్యేక పూజలు చేసుకోవడం సంతోషంగా ఉందని పలువురు యువతీ యువకులు చెప్పుకొచ్చారు.
- November 29, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- ALAMPUR
- GADWALA
- PULLUREGHAT
- TUNGABADRA PUSHKARALU
- అలంపూర్
- గద్వాల
- జోగుళాంబ
- తుంగభద్ర పుష్కరాలు
- పుల్లూరు ఘాట్
- Comments Off on పుష్కరస్నానం.. పుణ్యఫలం