- హన్వాడ– మహబూబ్ నగర్లో మధ్య ఏర్పాటు
- మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
సారథి న్యూస్, మహబూబ్ నగర్: వెయ్యి ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌ను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, హన్వాడ– మహబూబ్ నగర్లో మధ్యలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ వివరించారు. శుక్రవారం మహబూబ్ నగర్ కలెక్టరేట్లోని రెవెన్యూ మీటింగ్ హాల్లో అధికారులతో సమీక్షించారు. ప్రతి నియోజకవర్గంలో 20 ఎకరాల్లో రెండు గోదాములను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. రైతులు నకిలీ విత్తనాలు కొని నష్టపోకూడదని సూచించారు. నియంత్రిత వ్యవసాయ పద్ధతిపై అవగాహన కల్పించేందుకు క్లస్టర్ల వారీగా సదస్సులు నిర్వహిస్తామన్నారు. వానాకాలం యాక్షన్ ప్లాన్‌పై మంత్రి కలెక్టర్ వెంకట్రావుతో చర్చించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు సీతారామారావు,మోహన్ లాల్ తదితరులు పాల్గొన్నారు.