సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ఫ చిత్రం షూటింగ్ తెలంగాణ లోని పాలమూరు అడవుల్లో జరగనున్నట్టు సమాచారం. కరోనాతో ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం కూడా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడంతో కొంతమంది సిబ్బందితో షూటింగ్‌ను ప్రారంభించనున్నారట. పుష్ప చిత్రం ‘ఎర్రచందనం స్మగ్లింగ్’ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు టాక్. బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో నటించనున్నారట. అల్లు అర్జున్ గెటప్కూడా కొత్తగా ఉంది. ఈ సినిమా చాలా భాగం అడవుల్లో తెరకెక్కించాల్సి ఉంటుంది. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ పూర్తిచేసుకున్నది. తాజాగా పాలమూరు అడవుల్లో కొన్నిసీన్లు చిత్రీకరిస్తారట.