సారథి న్యూస్, రామాయంపేట: రాష్ట్రప్రభుత్వం పారిశుద్ధ్యానికే అధిక ప్రాధాన్యమిస్తున్నదని రామాయంపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతిగ్రామంలో డంపింగ్ యార్డులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఆయన మెదక్ డీపీవో హనోక్ తో కలసి నిజాంపేట మండలం చల్మేడ గ్రామంలో డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి దగ్గరే తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ నరసింహ రెడ్డి, ఎంపీపీ సిద్ధరాములు, జెడ్పీటీసీ విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.
- June 19, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- DUMPINGYARD
- medak
- RAMAYAMPET
- TELANGANA
- గ్రామం
- పారిశుద్ధ్యం
- Comments Off on పారిశుద్ధ్యానికే ప్రాధాన్యం