‘ఆర్ఎక్స్100’ మూవీతో గ్లామర్, యాక్షన్ రెండిటికీ సమపాళ్లలో న్యాయం చేసే నటిగా ప్రూవ్చేసుకుంది పాయల్ రాజ్పుత్. ఇప్పుడు మళ్లీ సేమ్ డైరెక్టర్ కాంబినేషన్లో నటించనుందట. హీరోయిన్గా కాదు.. తనకు హీరోయిన్గా సక్సెస్ ఇచ్చిన అజయ్ భూపతి ‘మహాసముద్రం’ మూవీలో స్పెషల్సాంగ్లో మెరవనుందట పాయల్. వెంకీమామ, డిస్కోరాజా చిత్రాల్లో పెద్ద హీరోలతో నటించినా ఫస్ట్మూవీకి వచ్చినంత క్రేజ్ సంపాదించలేకపోయింది పాయల్. ఇప్పుడు ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయనుంది అంటూ పుకారు వినిపిస్తోంది. ఏకే ఎంటర్ టైన్మెంట్బ్యానర్ పై సుంకరరామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ మూవీ లో శర్వానంద్, సిద్ధార్థ హీరోలుగా, అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఇంటెన్స్లవ్స్టోరీ గా రూపొందనున్న ఈ మూవీ షూటింగ్ వైజాగ్లో జరుగుతోంది. వచ్చే ఏడాది రిలీజ్కు సిద్ధమవుతోంది. కానీ పాయల్ సాంగ్రోల్ చేయనుందో లేదో ఇంకా క్లారిటీ అయితే లేదు. రీసెంట్గా ఓటీటీలో రిలీజైన ‘అనగనగా ఓ అతిథి’ చిత్రంతో ఇంప్రెస్చేసిన పాయల్ ప్రస్తుతం ‘ఏంజిల్’ తమిళ సినిమా, ‘5డబ్ల్యుఎస్’ బైలింగ్వల్చిత్రాల్లో నటించనుంది.
- December 15, 2020
- Archive
- Top News
- సినిమా
- ANGEL
- PAYALRAJPUTH
- RX100
- ఆర్ఎక్స్100
- ఏంజిల్
- మహాసముద్రం
- Comments Off on పాయల్.. ఇది నిజమా!