పాప్.. ర్యాప్ సింగర్స్ కు ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉండడం తెలిసిందే. అయితే తెలుగులో పాప్ సింగర్ గా ముద్ర వేసుకున్న స్మిత లేటెస్ట్ గా మరో పాప్ సాంగ్‌ను రూపొందించింది. ‘హాయ్ రబ్బా’ ఆల్బమ్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న స్మిత ‘బహాకిలిక్కి’ అనే ట్యూన్‌కు స్టెప్పులేసింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన వెండితెర అద్భుతం ‘బాహుబలి’ చిత్రానికి ట్రిబ్యూట్ గా స్మిత ఈ పాటను పాడింది. ‘బాహుబలి’ సినిమాలో కాలకేయుని జాతి కోసం రాజమౌళి సృష్టించిన ‘కిలిక్కి’ భాషలో ఈ వీడియో సాంగ్ చేయడం విశేషం.
2015లో యూట్యూబ్ లో విశేషంగా ఆకట్టుకున్న ‘బహా కిలిక్కి’ వీడియో సాంగ్.. 100 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి నాన్ ఫిల్మ్ రీజనల్ సాంగ్ గా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ‘బహా కిలిక్కి’ వీడియో సాంగ్ కాన్సెప్ట్ ప్రముఖ దర్శకుడు దేవా కట్ట డిజైన్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు సంగీతం అందించారు. మధన్ కార్కీ ఈ పాటకు సాహిత్యం అందించగా బాస్కో కొరియోగ్రఫీ చేశారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. స్మిత ఈ గీతాన్ని ఆలపించడంతో పాటు డ్యాన్స్ కూడా చేసింది. సింగర్ నోయల్ ర్యాప్ పాడాడు. ఇందులో ‘బాహుబలి’ చిత్రంలో కాలకేయ పాత్ర పోషించిన ప్రభాకర్ తో కలిసి ‘కిలిక్కి’ భాషలో స్మిత ఈ పాటను చిత్రీకరించారు. ఈ సాంగ్ లో కాలకేయుడిగా ప్రభాకర్.. స్మిత విభిన్నమైన గెటప్ లు వ్యూవర్స్‌ను ఆకట్టుకున్నాయి.