రాజకీయ జీవితానికి తాత్కాలికంగా గ్యాప్ ఇస్తూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పనులు శరవేగంగా పూర్తి అవుతున్నాయి. తర్వాత ఆయన డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘విరూపాక్ష’ సినిమా చెయ్యనున్నారు. అయితే పవన్ సినిమాలకు రీ ఎంట్రీ ఇవ్వగానే పండుగ చేసుకున్న ఫ్యాన్స్ ఇప్పుడీ వార్త విని కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. అదేమంటే పవన్ ఇక మీదట నటించబోయే చిత్రాల్లో డ్యాన్సులు చేయరట.. పాటలు కూడా ఉండవట. ఉన్నా అవి బ్యాగ్రౌండ్ స్కోర్కే పరిమితమట.
రాజకీయ సేవా కార్యక్రమాల్లో ఉంటూ పాటలు పాడటం.. రొమాన్స్ చెయ్యడం కరెక్ట్ పద్దతి కాదని పవన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా సమాచారం. మొగలాయిల కాలం నాటి కథతో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోంది ‘విరూపాక్ష’ చిత్రం. నిర్మాతగా ఏయం రత్నం వ్యవహిరిస్తున్నారు. ఇది చారిత్రాత్మక చిత్రం కనుక పాటలు కూడా పెద్దగా ఉండవని రెండు పాటలే ఉంటాయని.. అలాగే అతి తక్కువ కాలంలోనే సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యే విధంగా క్రిష్ డిజైన్ చేశారట. ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చుతున్న ఈ చిత్ర షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుందిట.