సారథి న్యూస్, హైదరాబాద్: ప్రత్యేక పరిస్థితుల్లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయని, కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు ఎవరైనాసరే అసెంబ్లీ ప్రాంగణంలోకి రావొద్దని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. సమావేశాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులు, మంత్రుల పీఏలు తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సమావేశాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఉన్నతాధికారులు, పోలీసులతో చర్చించామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సకాలంలో సరైన చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో మరణాల సంఖ్య చాలా వరకు తగ్గిందన్నారు.
- September 4, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- ASSEMBLY
- CARONA
- COVID19
- SPEAKER
- TELANGANA
- అసెంబ్లీ సమావేశాలు
- కరోనా
- కోవిడ్ పాజిటివ్
- తెలంగాణ
- స్పీకర్
- Comments Off on పాజిటివ్ తేలితే అసెంబ్లీ ఆవరణలోకి రావొద్దు