శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ జిల్లా పూంచ్ సెక్టార్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాకిస్తాన్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక ఇండియన్ ఆర్మీ జవాన్ అమరుడయ్యాడు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయని అధికారులు చెప్పారు. షాపూర్ సెక్టార్‌కు సమీపంలో జరిపిన కాల్పుల్లో అస్సాం రెజిమెంట్ 10 బెటాలియన్‌కు చెందిన సిపాయి లుంగాబుయ్ అనే 29 ఏళ్ల సైనికుడు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. గాయపడిన ఇద్దరు సైనికులను ట్రీట్‌మెంట్ కోసం హెలికాప్టర్ ద్వారా కమాండ్ హాస్పిటల్‌కు పంపినట్లు చెప్పారు. బోర్డర్‌లో పాక్ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. గత వారం రోజులుగా కాల్పులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలో గురువారం జరిపిన కాల్పుల్లో ఒక ఆర్మీ అధికారి మృతిచెందగా.. ఒక సివిలియన్ గాయపడ్డాడు.
- June 14, 2020
- Archive
- Top News
- జాతీయం
- ARMY
- PAKISTAN
- పాకిస్తాన్
- పూంచ్ సెక్టార్
- సైనికుడు
- Comments Off on పాక్ కాల్పుల్లో జవాన్ మృతి