సారథిన్యూస్, రామడుగు: హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో పల్లెలన్నీ పచ్చ బడాలని కరీంనగర్ కలెక్టర్ శశాంక పేర్కొన్నారు. గురువారం ఆయన రామడుగు మండలం శ్రీరాముల పల్లె గ్రామంలో ఆరోవిడుత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఎస్సీ కాలనీలో హరితవనం పార్కును సందర్శించారు. మరోవైపు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏసీసీ రామేశ్వర్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సీఐ సైదులు మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ కోమల్ రెడ్డి, ఎంపీడీవో సతీశ్‌రావు, సర్పంచ్ జీవన్, ఎంపీటీసీ మోదీ రవి, మాజీ సర్పంచ్ వెంకటరమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- July 2, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- ACP
- COLLECTOR
- HARITHAHARAM
- KARIMNAGAR
- PLANTS
- SIDDIPET
- కే శశాంక
- హరితహారం
- Comments Off on పల్లెలన్నీ పచ్చబడాలి