Breaking News

పర్యాటక హబ్ గా ప్రతాపరుద్రుడి కోట

పర్యాటక హబ్ గా ప్రతాపరుద్రుడి కోట

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: నాగర్ కర్నూల్ ​జిల్లా నల్లమల అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ప్రసిద్ధిచెందిన కాకతీయుల కాలం నాటి ప్రతాపరుద్రుడి కోట ప్రాంతాన్ని పర్యాటక హబ్ గా మార్చనున్నట్లు కలెక్టర్ ఎల్. శర్మన్ ప్రకటించారు. ఆదివారం అటవీశాఖ అధికారులతో కలిసి సుమారు 280 అడుగుల ఎత్తున్న కోటను కాలినడకన సందర్శించి కలియ తిరిగారు. పరిసర ప్రాంతాల వివరాలను జిల్లా అటవీశాఖ అధికారి కిష్టగౌడ్ ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. నల్లమల అటవీ ప్రాంతంలో 700 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న 13వ శతాబ్దానికి చెందిన కాకతీయుల సౌధం ప్రతాపరుద్రుడి కోటను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం ప్రకృతి సహజ వనరులతో దేశంలోనే ప్రసిద్ధిచెందిన వన్యప్రాణుల అభయారణ్యంలో ఒకటిగా గుర్తింపు పొందిందన్నారు. నల్లమల్ల లోతట్టు అటవీ ప్రాంతంలోని మేడిమల్కల సమీపంలోని కదలివనం, అలాగే ఫర్హాబాద్ వ్యూ పాయింట్ ను కలెక్టర్ శర్మన్ పరిశీలించారు.

నల్లమలలోని ప్రతాపరుద్రుడి కోటపైకి కాలినడకన వెళ్తున్న కలెక్టర్​ ఎల్​.శర్మన్​