Breaking News

పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే భూములు వెనక్కి

పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే భూములు వెనక్కి

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు భూములను తీసుకుని నిరుపయోగంగా ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని మంత్రి కె.తారక రామారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొస్తున్నామని వెల్లడించారు. కంపెనీలు కూడా ఇచ్చిన హామీల మేరకు కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. ఈ మేరకు నిర్ణీత గడువులోగా కార్యకలాపాలు ప్రారంభించని వారికి షోకాజ్ నోటీసులు జారీచేయాలని సూచించారు. దీంతోపాటు చేంజ్ ఆప్ ల్యాండ్ యూజ్ పేరుతో మార్పిడి చేసుకున్న కంపెనీలకు నోటీసులు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో అన్ని పరిశ్రమల వివరాలతో కూడిన సమగ్ర సమాచారం ఒకేచోట ఉండేలా బ్లూ బుక్ ను తయారుచేయాలని సూచించారు.