Breaking News

పనులు చేయకపోతే.. బ్లాక్​లిస్టులో పెట్టండి

పనులు చేయకపోతే.. బ్లాక్​లిస్టులో పెట్టండి

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగర పాలకసంస్థ పరిధిలో కొనసాగుతున్న ఇంజినీరింగ్ సంబంధిత అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కమిషనర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్ల పేర్లను బ్లాక్​లిస్టులో పెట్టాలని సూచించారు. అనుమతి పొందిన నిర్మాణ పనుల కోసం సిద్ధంచేసిన ప్రతిపాదనలను అనుసరించి పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఈనెల 20న జరిగే సచివాలయ ఉద్యోగ పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ఎస్ఈ సురేంద్రబాబు, ఎంఈ 2 రమణమూర్తి, సూపరింటెండెంట్ ప్రసాద్ గౌడ్, డీఈలు రాజశేఖర్, షాకీర్, రవిప్రకాష్ నాయుడు, రసూల్, వెంకట సుబ్బయ్య, హార్టికల్చర్ ఏడీ సుజాత, ఏఈలు దినేష్, రాచయ్య, హిమబిందు, కృష్ణలత ఉన్నారు.