Breaking News

పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోండి

పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి

సారథి న్యూస్, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రతి పట్టభద్రుడు ఓటరుగా తన పేరు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం మినిస్టర్స్​ క్వార్టర్స్​లో టీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటరు నమోదు అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేలా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా న్యాయవాదులు ఓటర్లుగా పేరు నమోదు చేసుకునేలా కృషిచేయాలని కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించేలా కృషిచేయాలన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు కళ్యాణ్ రావు, మల్లేష్, రాము, చంద్రశేఖర్ రావు, మురళీధర్, లలితారెడ్డి, రంజితా రెడ్డి పాల్గొన్నారు.