సారథి న్యూస్, హైదరాబాద్: పంద్రాగస్టు వేడుకలకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారిని ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని రాష్ట్రాలకు సూచించింది. ఇక, రాష్ట్ర రాజధానుల్లో ఉదయం 9 గంటలకు వేడుకలు నిర్వహించాలని సూచించారు. పోలీసు, ఆర్మీ, పారామిలటరీ, ఎన్‌సీసీ దళాలు మార్చ్‌ఫాస్ట్‌కు మాస్క్ ధరించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. కరోనా దృష్ట్యా భారీస్థాయిలో ప్రజలు వేడుకల్లో పాల్గొనకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కరోనా అత్యవసర సమయంలో సేవలు అందించిన వారిని కూడా వేడుకలకు పిలవాలని పేర్కొంది.
- July 23, 2020
- Archive
- Top News
- జాతీయం
- CARONA
- CENTRAL GOVT
- INDEPENDENCEDAY
- కేంద్రప్రభుత్వం
- పంద్రాగస్టు
- హైదరాబాద్
- Comments Off on పంద్రాగస్టు.. వీళ్లే ఆహ్వానితులు