సారథి న్యూస్, కర్నూలు: పంటల బీమా పథకం 2018-19 రబీ (ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత బీమా పథకం) పరిహారం పంపిణీ కార్యక్రమాన్ని తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసు నుంచి శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. పంటల బీమా పథకం కింద ఇన్సూరెన్స్ క్లెయిమ్ లబ్ధిపొందిన రైతు వై.మనోహర్ రెడ్డి కర్నూలు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంతో మాట్లాడారు. కాన్ఫరెన్స్లో గుమ్మనూరు జయరాం, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, కలెక్టర్ జి.వీరపాండియన్, జేసీ రవిపట్టన్ షెట్టి, ట్రెయినీ అసిస్టెంట్ కలెక్టర్ డాక్టర్ నిధిమీనా, జేడీఏ ఉమా మహేశ్వరమ్మ, ఇన్సూరెన్స్ క్లైమ్ లబ్ధి పొందిన రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- June 26, 2020
- Archive
- Top News
- కర్నూలు
- CRAP INSURANCE
- Kurnool
- YS JAGAN
- కర్నూలు
- ఫసల్ బీమా
- వైఎస్ జగన్మోహన్రెడ్డి
- Comments Off on పంటల బీమా పరిహారం పంపిణీ