- ఏపీలో 4వేలకు చేరువలో కేసులు
- మొత్తం 44,609 పాజిటివ్ కేసులు
- 24 గంటల్లో 52 మంది మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. టెస్టులు చేస్తున్నా కొద్దీ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 3,963 కేసులు నమోదైనట్లు శనివారం అధికారులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 44,609కు చేరింది. 24 గంటల్లో వ్యాధిబారిన పడి 52 మంది చనిపోయారు. దీంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 589కు చేరింది. చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కాగా ఇప్పటివరకు 21,763 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 22,260 మంది వివిధ హస్పిటల్స్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఒక్క రోజులో 23,872 శ్యాంపిల్స్‌ను పరీక్షించారు.