Breaking News

నేతన్నలకు చేయూత

నేతన్నలకు చేయూత

సారథి న్యూస్, హైదరాబాద్: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఇద్దరు చేనేత కార్మికులకు పరిశ్రమల శాఖ కె.తారక రామారావు అవార్డులను ప్రదానం చేశారు. 18 మందిని ఎంపికచేయగా, మిగతా 16 మందికి ఆయా జిల్లాల కలెక్టర్ల చేత అందజేశారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి వర్చువల్ గా, ఆన్​లైన్ లో వీక్షించి అవార్డు గ్రహితలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేనేత కార్మికుల కోరిక మేరకు నేతన్నకు చేయూత పథకాన్ని కొనసాగించేందుకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర చేనేత అవార్డు గ్రహీతలకు నగదు పురస్కారాన్ని ఈ సంవత్సరం నుంచి రూ.10వేల నుంచి రూ.25వేలకు పెంచి వారి ఖాతాలో జమచేయాలని అధికారులను ఆదేశించారు. నారాయణపేటలో చేనేత కార్మికులకు కామన్​ఫెసిలిటీ సెంటర్​ను నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.
పలు కీలక ఒప్పందాలు
ముఖ్యంగా పోచంపల్లి ఇక్కత్ రకంలో టై, డై చేయడంలో సులభ మార్గాలు, రంగుల రసాయనాలతో చేనేత కార్మికులకు జరుగుతున్న హానిని నివారించడం, టై,డై టెక్నిక్ లో కొత్త మార్గాల అధ్యాయనానికి ఐఐసీటీ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. చేనేత కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల అమలుపై అధ్యయనం, చేనేత వస్త్రాల మార్కెటింగ్ కోసం సలహాలు ఇచ్చేందుకు ఐఎస్​బీ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. చేనేత కార్మికుల జీవనోపాధి పెంపుదల, మార్కెటింగ్ సేవలపై యూఎన్​డీపీతో ఒప్పందం చేసుకున్నారు. అనంతరం ‘ఆలంబన యాప్’ను కూడా మంత్రి కేటీఆర్​ఆవిష్కరించారు. యూన్​డీపీ డిప్యూటీ రెసిడెంట్​నదియా రషీద్, జౌళిశాఖ సంచాలకులు శైలజారామయ్యర్, ఐటీశాఖ కార్యదర్శి జయేష్​రంజన్​పాల్గొన్నారు.