- విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా నిలిచిన పోయిన అంతర్జాతీయ విమానయాన సర్వీసులు శుక్రవారం నుంచి పున:ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ జూలై 17 నుంచి 31 మధ్య 18 ఫ్లైట్స్‌ను నడపనుందని ఆయన వెల్లడించారు. ఎయిర్ ఫ్రాన్స్ సైతం జులై 18 నుంచి ఆగస్టు 1 మధ్య 28 విమాన సర్వీసులను నడపనుందని తెలిపారు. ఢిల్లీ -న్యూయార్క్ మధ్య ప్రతిరోజు ఢిల్లీ – శాన్ ఫ్రాన్సిస్కో మధ్య వారానికి మూడురోజులపాటు విమానాలు నడవనున్నాయని కేంద్రమంత్రి చెప్పారు. అదే సమయంలో భారత్ నుంచి ఎయిరిండియా ఈ రెండు దేశాలకు విమానాలను నడపనుంది. ఈ మేరకు అమెరికా, ఫ్రాన్స్ దేశాలతో భారత్ ఒప్పందం చేసుకుంది.