చెన్నై: గాన గాంధర్వుడు, ఆంధ్రుల ఆరాధ్య దైవం బాలసుబ్రహ్మణ్యం నెమ్మదిగా కోలుకుంటున్నారని ఆయన కుమారుడు చరణ్ తెలిపారు. కరోనాతో ఈ నెల 5న చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చేరిన బాలూ ఆరోగ్యం క్రమంగా క్షీణించిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో ఎక్మా పరికరంతో కృత్రిమశ్వాసం అందిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణలోని బాలు అభిమానులు ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన చెందారు. ఆయన తొందరగా కోలుకోవాలని మృత్యుంజయ యాగాలు, హోమాలు, పూజలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడుతున్నదని.. వైద్యానికి ఆయన శరీరం సహకరిస్తున్నదని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ బుధవారం ఓ వీడియోను విడుదల చేశారు.
- August 26, 2020
- Archive
- Top News
- సినిమా
- BALASUBRAHMANYAM
- HEALTH
- SERIOUS
- SINGER
- SP CHARAN
- ఎంజీఎం
- ఎస్పీచరణ్
- బాలూ
- సింగర్
- హెల్త్
- Comments Off on నెమ్మదిగా కోలుకుంటున్న బాలు