సారథి న్యూస్, నిజాంపేట: ప్రజలకు కొంతకాలం నీళ్ల కష్టాలు తప్పవని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సింగూర్ జలాశయానికి నీళ్లు వస్తే ప్రజలకు నీళ్లకష్టాలు పోతాయని చెప్పారు. మంగళవారం ఆమె మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఆడబిడ్డలకు నీటికష్టాలు ఉండరాదని సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ప్రాజెక్టును ప్రారంభించారని చెప్పారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ సిద్దరాములు, జెడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్, తహసీల్దార్ జయరామ్, ఎంపీడీవో వెంకటలక్ష్మి, టీఆర్ఎస్ నేతలు కొండల్‌రెడ్డి, కిష్టారెడ్డి, అబ్దుల్ అజీజ్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
- August 4, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- KCR
- medak
- MLA
- NIJAMPET
- PADMA
- నిజాంపేట
- పద్మా దేవేందర్‌రెడ్డి
- Comments Off on నీళ్ల కష్టాలు తప్పవు