కరోనాతో వాయిదా పడ్డ టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ – షాలిని వివాహానికి ముహూర్తం కుదిరింది. ఏప్రిల్ 16ననే వీరి పెళ్లి జరగాల్సిఉండగా లాక్‌డౌన్‌తో వాయిదా పడింది. దీంతో జూలై 26న రాత్రి 8.30 నిమిషాలకు వీరి పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు ముహూర్తం పెట్టించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిరాడంబరంగా వివాహ వేడక జరుగనున్నది. ఇరుకుటుంబాల వారు మాత్రమే ఈ వేడుకకు హాజరుకానున్నారు. హైదరాబాద్‌లోని ఫలక్ నుమా ప్యాలస్‌లో పెళ్లి జరుగనున్నట్టు సమాచారం. భీష్మ సినిమాతో సూపర్హిట్‌ను సొంతం చేసుకున్న నితిన్ ప్రస్తుతం రంగ్ దే, చెక్ అనే రెండు సినిమాలు చేస్తున్నాడు. ఆ తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అంధాధున్ హిందీ రీమేక్, కృష్ణచైతన్య దర్శకత్వంలో పవర్పేట సినిమాలు చేయనున్నారు.