బాలీవుడ్లో సూపర్‌హిట్ అయిన ‘అంధాధున్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆయనే సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. మేర్లపాక గాంధీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. కాగా ఆంధాదున్లో టబు, రాధికాఆప్టే చేసిన పాత్రలను తెలుగులో ఎవరు చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొన్నది. రాధికా చేసిన పాత్రకు చిత్రనిర్మాతలు పూజా హెగ్డేను సంప్రదించగా ఆమె నో చెప్పిందట. భారీ రెమ్యునరేషన్ ఇస్తామన్నా చేసినా ఆమె ఒప్పుకోలేదట. వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదని చెప్పినట్టు సమాచారం. దీంతో వేరే హీరోయిన్ కోసం చిత్రబృందం ప్రయత్నిస్తోందట. కాగా టాలీవుడ్‌కు చెందిన ఓ అగ్రనిర్మాత ఒత్తిడితోనే పూజా ఈ నిర్ణయం తీసుకుందని ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.