సారథిన్యూస్, హన్మకొండ: ‘నా చావుకు కారణం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, కేసీఆర్ సార్.. వచ్చే ఎన్నికల్లో అతడికి టికెట్ ఇవ్వొద్దు’ అని లెటర్ రాసి ఓ వ్యక్తి గొంతు కోసుకున్నాడు. వరంగల్ అర్బన్ జిల్లా అలంకానిపెట చెందిన మాసం వెంకటేశ్వర్లు సోమవారం హన్మకొండలోని అదాలత్ వద్ద అమరవీరుల స్తూపం ముందు కత్తితో గొంతు కోసుకున్నాడు. రక్తం ధారలు కట్టడంతో స్థానికులు వెంటనే స్పందించి అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తన చావుకు కారణం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అని మరింత దుమారం సృష్టిస్తోంది. వెంకటేశ్వర్లుకు వైద్యులు చికిత్సనందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని కూడా ఆతడు సీఎం కేసీఆర్‌ను ఆయన కోరారు.ఈ క్రమంలో ఇతని ఆత్మహత్యాయత్నానికి, ఎమ్మెల్యేకు సంబంధం ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా స్పందించారు. అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని చెప్పారు.
- June 30, 2020
- Archive
- Top News
- క్రైమ్
- తెలంగాణ
- HANMAKONDA
- MLA
- PEDDI SUDARSHANREDDY
- SUCIDE
- YOUNGMAN
- పెద్ది సుదర్శన్‌రెడ్డి
- లెటర్
- Comments Off on నా చావుకు కారణం ఎమ్మెల్యే పెద్ది