అల్లు అర్జున్ డాటర్ చిన్నారి అర్హ చిన్నవయసులోనే బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది. అర్హకు సోషల్ మీడియాలో మామూలు ఫాలోయింగ్ లేదు. అర్హ చేసే అల్లరి వీడియోలను బన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయడమే దానికి కారణం. ఇటీవల ‘రాములో రాములా’ పాటకు దోసే స్టెప్ వేశావని బన్నీని ఏడిపించిన తీరుకు ఫ్యాన్సంతా మనసారా నవ్వుకున్నారు. తర్వాత ‘బుట్టబొమ్మ’ పాటకు లిప్ రీడింగ్ ఇచ్చిన వీడియో వైరలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు లేటెస్టుగా అల్లు అర్జున్ తన గారాలపట్టి అర్హకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేశాడు.
ఈ వీడియోలో అల్లు అర్జున్ .. ‘చిట్టతల్లీ.. నా బంగారు తల్లి.. నేను చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా..’ గోముగా అడిగాడు. దానికి అల్లు అర్హ ముందు విననట్టు నటించింది. తర్వాత బన్నీ రెట్టించి అడిగేసరికి ‘చేసుకోనూ..’ అంటూ సమాధానం చెప్పింది. ‘ఏంటి చేసుకోవా..?’ అని బన్నీ మరింత గారాబంగా అడిగాడు. ‘ఊహు.. నేను చేసుకోను’ అంటూ నవ్వుతూ అర్హ ఇల్లంతా పరుగులు తీసింది. అటెంప్ట్ నంబర్ #374.. ‘నానా ట్రయల్స్’ అని క్యాప్షన్ పెట్టిన బన్నీ ఇప్పటికి 374 సార్లు ప్రయత్నించానని చెబుతున్నాడు. ఇప్పుడు అర్హ బన్నీల ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బన్నీ చిలిపి ప్రశ్నలు అర్హ క్యూట్ సమాధానం అందరికీ నవ్వులు తెప్పిస్తున్నాయి.